తెలంగాణ, Jul 20, 2026
తెలంగాణలో సంచలనం సృష్టిస్తూ, ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రివిలేజ్ కమిటీ సీసీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను సేకరించి, ఉదయ్ కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ధారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, తక్షణమే అతన్ని ఎన్పీఏ నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సర్వీస్‌లో చేరడానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT)దే తుది నిర్ణయమని ఎన్పీఏ పేర్కొంది. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.











