హైదరాబాద్, 30 July
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ. 2,000 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడుదల ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించినట్లు అయింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూ. 2,000 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
గతంలో మే 29న మొదటి విడతగా, జూన్ 30న రెండో విడతగా రూ. 2 వేల కోట్ల చొప్పున విడుదల చేసిన విషయం విదితమే. తాజా విడుదల ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించినట్లయింది.
రాబోయే రోజుల్లో మిగిలిన ఇతర బకాయిలను కూడా చెల్లిస్తామని ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొంది. ఈ బకాయిల విడుదలపై ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.












