హైదరాబాద్, జూలై 23
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న నియామక ప్రక్రియలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల జేఏసీ ఈ నెల 2424న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్ ద్వారా నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న నియామక ప్రక్రియలను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల జేఏసీ ఈ నెల 24న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా జేఏసీ రాష్ట్ర బంద్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే బంద్ ఉద్దేశమని తెలిపారు.
శాంతియుతంగా బంద్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసిన వారు, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు పెండింగ్ నియామకాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.











