నిర్మల్, జూలై 9
నిమల జిలల సోన పోలీస సటేషనను జిలల ఎసపీ డ. జి. జనకి షమిల, ఐపీఎస గుువం వషికంగ తనిఖీ చేశు. ఈ సంభంగ పోలీసు సిబబంి నివహించిన పేడను పిశీలించిన ఎసపీ గౌవ వంనం సవీకించు. సటేషనలోని ికడులు, కేసు ఫైళలు, ిజిసటలు, మలఖన, ఆుధగం, లకప, సీసీటీఎనఎస (CCTNS) నివహణతో పటు ఇత పిపలన అంశలను కషుణణంగ పిశీలించు.
నిర్మల్ జిల్లా సోన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ గురువారం వార్షికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను పరిశీలించిన ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి, స్టేషన్‌లోని రికార్డులు, కేసు ఫైళ్లు, రిజిస్టర్లు, మాల్ఖానా, ఆయుధాగారం, లాకప్, సీసీటీఎన్ఎస్ (CCTNS) నిర్వహణతో పాటు ఇతర పరిపాలనా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. స్టేషన్ రైటర్లు, సీసీటీఎన్ఎస్ సిబ్బంది పనితీరును ప్రత్యేకంగా అభినందిస్తూ, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తున్న తీరును ప్రశంసించారు.
తనిఖీ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఎస్సైలు గోపి, హనుమాన్లు, శ్రావణితో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.











