నిర్మల్, జులై 10
నిర్మల్ కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాం భద్రతా ఏర్పాట్లను, అందుబాటులో ఉన్న వ్యవస్థలను ఆయన సమీక్షించారు.
కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును, అగ్నిమాపక వ్యవస్థ పనితీరును తనిఖీ చేశారు.
పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణతో మెరుగైన భద్రతను నిర్వహించాలని, సిబ్బంది పటిష్ట అగ్నిమాపక వ్యవస్థను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అగ్నిమాపక అధికారి శివాజీ, తహసిల్దార్ రాజు, అధికారులు స్వాతి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











