మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 04
వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై వంటా వార్పులు చేస్తున్నారని, అయితే అవి వంటావార్పులా లేక కేసీఆర్ కు తద్దినాలా అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లక్ష్మీదేవి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ మాట తప్పాడని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిందని, రైతుల కలను సహకారం చేయబోతుందని స్పష్టం చేశారు.
వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై వంటా వార్పులు చేస్తున్నారని, అయితే అవి వంటావార్పులా లేక కేసీఆర్ కు తద్దినాలా అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీవ్రస్థాయిలో ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లక్ష్మీదేవి ప్రాజెక్టు విషయంలో కుర్చీ వేసుకొని కూర్చుని పని చేయిస్తానన్న కేసీఆర్ మాట తప్పాడని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిందని, రైతుల కలను సహకారం చేయబోతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా షాద్ నగర్, చేవెళ్ల నియోజకవర్గం పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వడమే కాకుండా, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు కూడా అవసరం మేరకు నీరు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. షాద్ నగర్ రైతాంగం కోరుకున్నట్లు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.
నెల రోజుల కింద ఈ ప్రక్రియ పూర్తి చేసి డిస్ట్రిబ్యూటర్ కెనాల్‌కు ఎంత భూమి అవసరం గుర్తించి ప్రస్తుతం భూసేకరణ కోసం రంగం సిద్ధం చేసిందని పేర్కొన్నారు. లక్ష్మీదేవి పల్లి విషయంలో మోసం చేసింది ఎవరో.. న్యాయం చేసింది ఎవరో ప్రజలు, పత్రికా ప్రతినిధులు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యారెంటీలను కూడా తమకున్న సమయంలోపు పూర్తి చేస్తామని వెల్లడించారు. పదేళ్లపాటు ఏ పని చేయని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వెయ్యి రోజుల పాలనపై ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికలలో ఓడిపోయాక ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు.. అక్కడే నిద్రపోతున్నాడు.. అసెంబ్లీకి రావడం లేదు.. ప్రజాధనాన్ని తన జీతానికి, తనకు అందించే వసతులకు వృధా చేస్తున్నాడు.. అలాంటి కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో పండుకుంటే ఎలా.. ప్రజల్లోకి రా.. అని ప్రశ్నించే దమ్ము బీఆర్ఎస్ నాయకుల్లో ఒక్కరికైనా ఉందా.. అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని దిగమింగి ఫాం హౌజులు కట్టుకొని పండగ చేసుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు నిద్రలేచి ప్రజా సమస్యలపై పోరాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ధర్నా చేస్తూ రోడ్లమీద కూర్చున్న సన్నాసులు, దద్దమ్మలు , చవటలు అందరికీ నేను ఒకటే చెబుతున్నా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రైతుల కోసం పోరాటం చేసింది.. ప్రస్తుతం అధికారంలో ఉండి రైతులకు న్యాయం చేస్తుంది.. కానీ బీఆర్ఎస్ హయాంలో రైతులపై తుపాకీ గురి పెట్టింది ఎవరు.. రైతులను అరెస్టులు చేసి జైలు పాలు చేసింది ఎవరు.. ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.












