ఖానాపూర్, జూలై 31
ఖానాపూోమూడుోజుుగాుుసతుననభాీవషాాణంగాసుభాషనగానీోనితాతాివంతనొుుపోయింది.దీనిపైసపందించిననిమజిాభూవేషమిశా,వంతననుపిశీించి,వాగుఅవతిఒడడునఉననమైనాీసిడనషియపాఠశావిదయాథుుఅననిసౌయాుపించానిఅధిాునుఆదేశించాు.
ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ 12వ వార్డులో ఉన్న తాత్కాలిక వంతెన, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో, నిర్మల్ జిల్లా కలెక్టర్ భూవేష్ మిశ్రా గారు ఆ వంతెనను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాగు అవతలి ఒడ్డున ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని పాఠశాల అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్, వైస్ చైర్మన్ ముహమ్మద్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్లు బొప్పరపు సత్యవతి, చిన్నం సత్యనారాయణ, తొడసం ఇందిర, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, ఎమ్మార్వో సుజాత, మండల విద్యాధికారి సంధ్యారాణి, నాయకులు గొర్రె గంగాధర్, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












