నిర్మల్, జూలై 17
నిర్మల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్లు, భూగర్భ జలాల సంరక్షణ తదితర అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇండ్లు, భూగర్భ జలాల సంరక్షణ తదితర అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో వివిధ దశల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మండలాల వారీగా నిర్మాణాల పురోగతి, లబ్ధిదారులకు అందించిన ఆర్థిక సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవోలు ప్రతిరోజూ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణాల్లో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
భూగర్భ జలాల సంరక్షణలో భాగంగా వ్యవసాయ నీటి నిల్వ గుంటలు, వర్షపు నీటి పునర్వినియోగ నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి వనరులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు సంచాలకుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.












