Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 17
రానున్న గోదావరి నది పుష్కరాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటి నుంచే ప్రారంభించాలని, ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్) ఆన్ లైన్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖానాపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్, పుష్కర ఘాట్లను, ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించారు.
రానున్న గోదావరి నది పుష్కరాలకు తగిన ఏర్పాట్లు చేయాలని, ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఆన్ లైన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం ఖానాపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా, గోదావరి నది పుష్కర ఘాట్లను పరిశీలించారు. పట్టణంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ తీరును కూడా సమీక్షించారు.
ముందుగా ఖానాపూర్ పట్టణంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారముల డిజిటలైజేషన్ సరళిని పరిశీలించిన కలెక్టర్, తప్పనిసరిగా గడువులోగా ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం ఓటర్ల సంఖ్య, ఇప్పటి వరకు తిరిగి తీసుకున్న ఫారములు, పూర్తిచేసిన ఆన్ లైన్ వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓ యాప్ ను పరిశీలించి, ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని, బూత్ లెవెల్ అధికారులు క్షేత్ర స్థాయిలో ఓటర్లకు ఫారములు నింపుటలో సహకారం అందించాలని చెప్పారు.
అనంతరం గోదావరి నది పుష్కర ఘాట్లను పరిశీలించిన కలెక్టర్, పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు పుష్కర ఘాట్లకు చేరుకునే విధంగా తగిన రోడ్డు సౌకర్యం కల్పించాలని, ఘాట్లను పుణ్య స్నానాలు ఆచరించేందుకు వీలుగా సిద్ధం చేయాలని పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో రాధా రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ సోయబ్ హుస్సేన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












