బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూన్ 29
బైంసా నియోజకవర్గంలోని గ్రామాల్లో 40 గోదాములు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.16.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. గత వారం రోజుల్లోనే రూ.27 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైతుల సౌకర్యార్థం ఉపాధి హామీ పథకం కింద గోదాముల నిర్మాణం చేపట్టడమే లక్ష్యమని చెప్పారు.
నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో 40 గోదాముల నిర్మాణం, సీసీ రోడ్ల కోసం రూ.16.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. గత వారం రోజుల క్రితం 35 గోదాములు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.27 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో గోదాముల నిర్మాణం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
గత రెన్నరేళ్ల కాలంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఎన్నడూ లేని విధంగా చేపట్టామని, ప్రస్తుతం మహిళా సమైక్య భవనాలు, అంగన్వాడీ భవనాలు, పాఠశాలలకు ప్రహరీ గోడలు, గోదాముల నిర్మాణం, కమ్యూనిటీ క్యాటిల్ షెడ్ల నిర్మాణం జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే తన ధ్యేయమని ఆయన అన్నారు.












