కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న అనంతరం, భారత జాతీయ పుస్తక న్యాస్ (NBT) దక్షిణ ప్రాంత అధికారి డా. పత్తిపాక మోహన్‌ను మైగిఫ్ట్ రూపశిల్పి, బహుభాషావేత్త, ఆర్మీ జూనియర్ అధికారి, రచయిత డా. పెరుక రాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఓ సాహిత్య కార్యక్రమంలో భాగంగా డా. మోహన్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా డా. పెరుక రాజు తన తాజా సాహిత్య సంపుటాలైన "అవ్వ" కథల సంపుటి, "సాగు" భారతీయ భాషల అనువాద కథల సంకలనాన్ని డా. మోహన్‌కు బహూకరించారు.
సత్కారానికి స్పందించిన డా. పత్తిపాక మోహన్, "మన మధ్యలో ఈ సత్కారమా!" అంటూ ఆనందం వ్యక్తం చేశారు. డా. పెరుక రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాటల రచయిత నందు తదితరులు పాల్గొన్నారు.
సాహిత్య సేవతో పాటు "మైగిఫ్ట్" స్వచ్ఛంద సంస్థ ద్వారా సామాజిక సేవలను విశేషంగా అందిస్తున్న డా. పెరుక రాజు, "ప్రోత్సహించడమే మైగిఫ్ట్" అనే సందేశంతో సాహిత్య, సామాజిక రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నాడు.












