** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 23
రాజధానిలో బొద్దింకల వీరవిహారం కొనసాగుతోంది. అన్ని దారులు మూసి, ద్వారాల వద్ద కాపు కాసినా, ఆగని న్యాయపోరాటం కొనసాగుతోందని జంధ్యాల రఘుబాబు (9849753298) పేర్కొన్నారు. అధర్మంపై, అమానుషంపై అలుపెరుగని అసహన ప్రకటన వెలువడుతోందని, యువశక్తి నడుం బిగించిందని తెలిపారు.
రాజధానిలో బొద్దింకల వీరవిహారం కొనసాగుతోంది. అన్ని దారులూ మూసి, అన్ని ద్వారాల వద్ద కాపు కాసినా, ఆగని న్యాయపోరాటం కొనసాగుతోందని జంధ్యాల రఘుబాబు (9849753298) పేర్కొన్నారు. అధర్మంపై, అమానుషంపై అలుపెరుగని అసహన ప్రకటన వెలువడుతోందని తెలిపారు. బయట టేర్ వాయువులు, భాష్పవాయువులు నిర్భందించలేని, నిరోధించలేని యువశక్తి నడుం బిగించిందని అన్నారు.
దుర్మార్గపు రాజనీతి రాజ్యమేలుతోందని, లోన అధర్మేంద్రుడు ఏసీ గదుల్లో రక్షణవలయంలో హాయిగా సేదతీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. చుట్టూ ఉన్న దుష్టచతుష్టయాలు కూడా సిగ్గుతో తలవంచుకునేంతటి చిన్నపిల్లల మరణాలు బయటపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులై వెలగాల్సినవారు అవినీతి మంటల్లో మాడిమసయ్యారని పేర్కొన్నారు.
చట్టసభల్లో కళ్లున్నా చూడలేని ధృతరాష్ట్రులు, చెవులున్నా వినలేని భీష్ములు ధర్మాలు ప్రవచిస్తున్నారని ఎద్దేవా చేశారు. బిర్నాం అడవులు నడిచివచ్చి మేక్బెత్ ను చుట్టుముట్టినట్టు, బొద్దింకల గుంపులు కోట చుట్టూ చేరి ఈ పాలనకు చరమాంకం గీతం రచిస్తున్నాయని, గానం చేస్తున్నాయని వినాలని సూచించారు. ఇకనైనా కళ్లు తెరిచి మనసుతో చూడాలని, కాలగర్భంలో కలిసిపోకముందే చిన్నారులకు న్యాయవైద్యం అందించాలని కోరారు.











