సిర్పూర్ (టి), 2026-06-05
సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు కార్మికుల మద్దతుతో జేఏసీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు 105వ రోజుకు చేరుకున్నాయి. పేపర్ మిల్లులో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఏ కార్యక్రమాలు చేపట్టినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
సిర్పూర్ పేపర్ మిల్లు గేటు ముందు కార్మికుల మద్దతుతో జేఏసీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు 105వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఏ కార్యక్రమాలు చేపట్టినా పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పేపర్ మిల్లు యాజమాన్యం వహించాల్సి వస్తుందని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
పేపర్ మిల్లులో గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటికీ 105వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, వెంటనే యజమాన్యంతో చర్చించి, హైకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ఏకైక మార్గమైన గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని వారు ముక్తకంఠంతో కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం గానీ, యజమాన్యం గానీ తమ పోరాటాన్ని తేలికగా తీసుకుంటే కార్మికుల ఆగ్రహానికి, కార్మిక కుటుంబాల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం బలికాక తప్పదని జేఏసీ నాయకులు హెచ్చరించారు. రానున్న రోజుల్లో తమ పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని, ఆందోళన కార్యక్రమాల్లో ఎలాంటి సంఘటనలు జరిగినా పూర్తిగా యజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ముందస్తుగా డిమాండ్ చేశారు.
ఈరోజు దీక్షలో మొగిలి వెంకటేష్, ఏకే సింగ్ కూర్చున్నారు. వారికి జేఏసీ నాయకులు గోలెం వెంకటేశం, కలికోట రమణయ్య, గోగర్ల రాములు, బింగి రమేష్, ముంజం శ్రీనివాస్, జీల్లా రాఘవులు, మహమ్మద్ షబ్బీర్, జాడి అశోక్, బండి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు.












