నిర్మల్, 2026-08-27
జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పారు.
జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పారు.
ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. 2వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన సుమారు రూ.10,000 కోట్ల పెండింగ్ బిల్లులను ప్రతి నెలా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ మహా ధర్నాకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు రామకిషన్ రెడ్డి, మారుకొండ రాము, రావుల రాంనాథ్ మద్దతు తెలిపారు. ఎంసీ లింగన్న మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జాతీయ కళాకారులు డా. ఫిరంగి జోసెఫ్ బాబూరావు, తెలంగాణ ధూంధాం కళాకారులు దరువు భోజన్న, ఎడగనూరు దినేష్ తమ పాటలతో పాల్గొన్న వారిని అలరించారు.












