నిర్మల్ పట్టణంలో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' నియోజకవర్గ స్థాయి సమావేశం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించారు.
పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో జరిగిన ఈ సమావేశంలో, అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం వంటి రంగాలలో వారి ఉన్నతికి కృషి చేస్తోందని తెలిపారు. త్వరలో మరిన్ని కొత్త పథకాలు ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
99 రోజుల ప్రణాళికలో భాగంగా వచ్చే వారం నుంచి రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. వివిధ శాఖల స్టాల్స్‌ను కూడా అదనపు కలెక్టర్ సందర్శించారు.
ఈ సమావేశంలో డిఆర్డిఓ విజయలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, డిఎంహెచ్వో రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.








