ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కుబీర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం జరిగింది. కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు కాకుండా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత కార్మికులకు పిలుపునిచ్చారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కుబీర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఐఎఫ్టీయూ నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిత మాట్లాడుతూ, కార్మికుల డిమాండ్ల పరిష్కారం విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్మిక సంఘాల జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.
సమ్మె ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ ఆర్టీసీ డ్రైవర్, ఖమ్మం జిల్లా భద్రాచలం డిపోకు చెందిన మరో డ్రైవర్ ఆత్మహత్యలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఐఎఫ్టీయూ ఆరోపించింది.
“ఆత్మహత్యలు కాదు… పోరాడి హక్కులు సాధించుకోవాలి” అంటూ కార్మిక వర్గానికి హరిత పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమ్మెను విరమింపజేయాలని, లేనిపక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.








