కుంటాల మండలంలోని దౌనెల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు కుంటాల మాజీ ఎంపీపీ జి.వి. రమణారావు, దౌనెల్లి సర్పంచ్ మెట్టు రాజు తెలిపారు.
బుధవారం, మాజీ ఎంపీపీ జి.వి. రమణారావు, సర్పంచ్ మెట్టు రాజు దౌనెల్లి గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.
గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వాటిని త్వరగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
గురువారం గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, చెరువు మరమ్మత్తులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి మండల ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని జి.వి. రమణారావు విజ్ఞప్తి చేశారు.












