నిర్మల్ జిల్లా, కుంటాల మండలం పరిధిలోని అందకూర్ గ్రామ పంచాయతీలో గ్రామాభివృద్ధి మరియు ఉపాధి కల్పన లక్ష్యంగా ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఫిష్ పాండ్ పనులను సోమవారం గ్రామ సర్పంచ్ శ్రీమతి ఏర్రోజు ప్రవళి ప్రశాంత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామ పరిధిలోని నీటి వనరుల అభివృద్ధి, చేపల పెంపకానికి ప్రోత్సాహం అందించడం, తద్వారా గ్రామస్తులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చడం ఈ పనుల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా స్థానిక కూలీలకు పని కల్పించడంతో పాటు, గ్రామ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ న్యకపు లక్ష్మణ్, ఏపీవో గట్టుపల్లి నవీన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి డి. రమ్య, టెక్నికల్ అసిస్టెంట్ శేషిందర్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ ఎం. బోజన్నతో పాటు పలువురు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఫిష్ పాండ్ పనుల వల్ల గ్రామంలో చేపల పెంపకం ద్వారా ఆదాయం పెరగడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. గ్రామాభివృద్ధికి ఇలాంటి పనులు ఎంతో ఉపయోగకరమని స్థానికులు పేర్కొన్నారు.

