హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బస్సు యాత్రపై విస్తృతంగా చర్చించారు. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బస్సు యాత్ర ప్రారంభం కానుంది.
హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బస్సు యాత్రపై విస్తృతంగా చర్చించారు.
నాయకులు మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బస్సు యాత్ర ప్రారంభం కానుందని తెలిపారు. 1976లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లంబాడీ, ఎరుకల, యానాది తెగలకు విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధి రంగాల్లో అవకాశాలు కల్పించిన నిర్ణయాన్ని వారు గుర్తు చేసుకున్నారు. ఆ నిర్ణయం వల్ల ఆయా తెగలకు అవకాశాలు లభించాయని, ఇందిరాగాంధిని ఆదివాసీ, గిరిజన వర్గీయులు తమ ఆరాధ్య నాయకురాలిగా భావిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తండాలు, గూడెల్లో బస్సు యాత్ర నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, గిరిజనుల అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేయడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను పెంపొందించడం ఈ యాత్ర లక్ష్యమని తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్, శాసనసభ్యులు రాంచందర్ నాయక్, బాలు నాయక్, శాసనమండలి సభ్యుడు శంకర్ నాయక్, త్కార్డు సంస్థ అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, మాజీ శాసనమండలి సభ్యుడు రాములు నాయక్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్తలు, రాష్ట్ర ఆదివాసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వి. లింగం నాయక్, కురాకుల మల్లికార్జున్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు బాణావత్ గోవింద్ నాయక్‌తో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.











