మిర్యాలగూడ, 2026-08-13
ప్రభుత్వం శాసనసభలో ఇచ్చిన హామీల అమలును సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేరేలా కృషి చేస్తానని ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. గురువారం తెలంగాణ శాసన మండలిలో ఆయన బాధ్యతలను స్వీకరించారు.
ప్రభుత్వం శాసనసభలో ఇచ్చిన హామీల అమలును సమర్థవంతంగా పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలు సకాలంలో నెరవేరేలా కృషి చేస్తానని ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తెలిపారు. గురువారం తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కేతావత్ శంకర్ నాయక్ బాధ్యతలను స్వీకరించారు.
ప్రాథమిక సమావేశం
అనంతరం జరిగిన 202627 ప్రాథమిక సమావేశంలో చైర్మన్‌గా శంకర్ నాయక్ హాజరై కమిటీ కార్యకలాపాలపై చర్చించారు.
అభినందనలు
ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, కమిటీ సభ్యులు భాను ప్రసాద్, రవీందర్, మధుసూదన్, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ అధికారులు నరసింహాచారి, తిరుపతి లు బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్‌కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.












