భైంసా, 2026-08-06
తానూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హంగుందే పుండ్లిక్ జన్మదినాన్ని పురస్కరించుకొని భైంసాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముధోల్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు భోస్లే నారాయణరావు పాటిల్ పుండ్లిక్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు తినిపించి శాలువాతో సన్మానించారు.

పార్టీ బలోపేతానికి కృషి
ఈ సందర్భంగా భోస్లే నారాయణరావు పాటిల్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి హంగుందే పుండ్లిక్ నిరంతరం కృషి చేస్తూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ చంద్రే, మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు చంద్రకాంత్, షహీద్ భాయ్, బెంబెర్ గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, షేక్ షదుల్, షేక్ సాజిద్, మాధవరావు పాటిల్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.