తానూర్, 2024-09-01
తానూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన ఉపాధ్యక్షుడిగా మాధవరావు ఇరవత పాటిల్ బిందగే, ప్రధాన కార్యదర్శిగా లోఖండే నాగోరావు జ్ఞానోబా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారిని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.
తానూర్, సెప్టెంబరు 01, మనోరంజని తెలుగు టైమ్స్ : కాంగ్రెస్ పార్టీ తానూర్ మండల ఉపాధ్యక్షుడిగా మాధవరావు ఇరవత పాటిల్ బిందగే, మండల ప్రధాన కార్యదర్శిగా లోఖండే నాగోరావు జ్ఞానోబా ఎంపికైన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు నూతనంగా ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
షేక్ సాజిద్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా ఆత్మ కమిటీ డైరెక్టర్ షేక్ షాదూల్, మాజీ ఎంపీటీసీ లాఖే నాగోరావు, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ బషీర్, విఠల్ గంగారాం అంబేకర్, వార్లే మారోతి లాల్పాటిల్, చంద్రప్రకాశ్ కాంబ్లే, మారోతి పాటిల్, శెల్కే భోజరాం, లోఖండే కిషోర్, లోఖండే మాధవరావు, షేక్ అకబర్, షేక్ ఇషాక్, రమేష్ లోఖండేతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.











