బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు శ్రీకాంతాచారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. శనివారం బైంసాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు శ్రీకాంతాచారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. శనివారం బైంసాలో శ్రీకాంతాచారి జయంతిని పురస్కరించుకుని ఆయన మాట్లాడారు.
విగ్రహ ఏర్పాటుపై స్పందన
త్వరలో బైంసాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేస్తామని పలుమార్లు అనుమతి కోరినప్పటికీ జిల్లా ఎస్పీ, కలెక్టర్ అనుమతి నిరాకరించడం సరికాదని ఆయన అన్నారు.
అధికారుల తీరుపై విమర్శలు
అమరవీరుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తూనే ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. నిర్మల్ లో కాంగ్రెస్ నాయకుల విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తూ, బైంసాలో ఇలా చేయడం సరికాదని పేర్కొన్నారు.
విగ్రహం ఏర్పాటు చేసి తీరతాం
అనుమతి లేకున్నా శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు.











