మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 11
గుండెలపై గర్వంగా, మన ఇంటిపై గౌరవంగా జాతీయ జెండా ఎగరవేయాలని హర్ ఘర్ తిరంగా జోనల్ కన్వీనర్ రావుల రామనాథ్ గారు పిలుపునిచ్చారు. మంగళవారం మామడ మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గుండెలపై గర్వంగా, మన ఇంటిపై గౌరవంగా జాతీయ జెండా ఎగరవేయాలని హర్ ఘర్ తిరంగా జోనల్ కన్వీనర్ రావుల రామనాథ్ గారు అన్నారు. మంగళవారం మామడ మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
దేశభక్తిని చాటేలా కార్యక్రమం
మన దేశ భక్తిని చాటేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని యువత ముందుకు వచ్చి, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేలా ప్రజలను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేశారు. పార్టీలకతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని మన దేశ భక్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
ర్యాలీలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రంజిత్ కుమార్, మామడ మండల సర్పంచులు, ఉప సర్పంచ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.












