నెల్లూరు గ్రామీణం, 2026-09-01
ప్రజా, యువజన ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచిన నెల్లూరు (సింహపురి)లో డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆహ్వాన సంఘం పూర్తి చేసింది. గోడ రాతలు, కరపత్రాలు, పోస్టర్, లోగో ఆవిష్కరణ వంటి కార్యక్రమాలతో పాటు, మహాసభ విశిష్టతను తెలుపుతూ ఆటోల ద్వారా వాడవాడలా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.
ప్రజా, యువజన ఉద్యమాల పురిటిగడ్డగా పేరుగాంచిన నెల్లూరు (సింహపురి)లో డివైఎఫ్ఐ 16వ రాష్ట్ర మహాసభ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఈ మహాసభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆహ్వాన సంఘం పూర్తి చేసింది. గోడ రాతలు, కరపత్రాలు, పోస్టర్, లోగో ఆవిష్కరణ వంటి కార్యక్రమాలతో పాటు, మహాసభ విశిష్టతను తెలుపుతూ ఆటోల ద్వారా వాడవాడలా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 25 కేంద్రాల్లో డివైఎఫ్ఐ పతాకావిష్కరణలు జరిగాయి.
మహాసభ తొలిరోజు మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు నెల్లూరులోని విఆర్ సి మైదానం నుంచి భారీ ర్యాలీ ప్రారంభమై సాయంత్రం ఐదు గంటలకు నర్తకి సెంటర్ కు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు డివైఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఎఎ.రహీం, జాతీయ ఉపాధ్యక్షులు జాక్ సి. థామస్, రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
డివైఎఫ్ఐకు నెల్లూరు జిల్లాలో ఘనమైన చరిత్ర ఉంది. అక్షరాస్యత ఉద్యమం, సారా వ్యతిరేక ఉద్యమం, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం జరిగిన పోరాటాల్లో ఈ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో నక్సలైట్లు, మతోన్మోదుల చేతుల్లో డివైఎఫ్ఐ నాయకులు మస్సూర్, గోను చలపతి, చెంచయ్య అసువులు బాశారు. ఇటీవల డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతున్న కె.పెంచలయ్య గంజాయి బ్యాచ్ చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో నిర్వహిస్తున్న మహాసభ ప్రాధాన్యతను సంతరించుకుంది.
నెల్లూరు నగరాన్ని అలంకరించారు. ప్రధాన కూడళ్లలో డివైఎఫ్ఐ తోరణాలు, పతాకాలు రెపరెపలాడుతున్నాయి. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న నెల్లూరుకు ఇప్పటికే చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరిగే ప్రతినిధుల సభకు రాష్ట్ర నలుమూలల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ర్యాలీని, బహిరంగ సభను, మహాసభను విజయవంతం చేయాలని రామన్న కోరారు.












