మిర్యాలగూడ, 2026-09-01
మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని మంగళవారం విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రాజీవ్ భవన్) లో మంగళవారం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనపై విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి, ప్రజా ప్రభుత్వ 1000 రోజుల పాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.











