హైదరాబాద్, 2026-08-27
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ జనసేన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు గుప్పించింది. అభివృద్ధి పనుల పురోగతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమం (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ సర్కారును నిలదీసింది.

రూ.35.19 కోట్ల నిధులున్నా టెండర్లు ఏవి
గత జనవరి 3న ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన పూర్తయినా, నేటికీ పనుల్లో కదలిక లేకపోవడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండగట్టు అభివృద్ధి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటిడి) నుంచి సిద్ధంగా ఉన్న 35.19 కోట్ల నిధులు లభ్యతలో ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు టెండర్లు ఎందుకు పిలవలేదని సూటిగా ప్రశ్నించింది.
స్థానిక నేతల మౌనం వెనుక మర్మమేంటి
ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు స్థానిక నాయకులు కొండగట్టు పనుల ఆలస్యంపై ఎందుకు నోరు విప్పడం లేదని జనసేన ప్రశ్నించింది. కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నా పనులు ప్రారంభించకపోవడం వెనుక ఉన్న అసలు కారణాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తక్షణమే బహిర్గతం చేయాలని, ఈ జాప్యంపై స్పష్టమైన సమాధానం చెప్పాలని తీవ్రంగా డిమాండ్ చేసింది.