బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 06
తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంతకర్త, ఉద్యమ తాత్వికుడు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఘన నివాళులు అర్పించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన సిద్ధాంతకర్త, ఉద్యమ తాత్వికుడు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఘన నివాళులు అర్పించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జయశంకర్ సార్ అందించిన సిద్ధాంతపరమైన మార్గదర్శకత్వం, చేసిన త్యాగాలు, ఉద్యమానికి ఇచ్చిన దిశ తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
త్యాగాలు చిరస్మరణీయం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జయశంకర్ సార్ కన్న కలను బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో సాకారం చేశారని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జయశంకర్ సార్ చూపిన మార్గంలోనే బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని, ఆయన ఆశయాల సాధనే నిజమైన నివాళి అని తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు స్వామి, మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు సుధీర్ రెడ్డి, రాజు, రవీందర్, బాబులాల్, సంజీవ్, మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు ఎలుక రాజు, విడిసి చైర్మన్ అల్లకొండ పోతన్న, మెడిచేల్మా ప్రవీణ్, రమణ రెడ్డి, బత్తుల రమేష్, గంగమల్లు, సంజీవ్, సందీప్, సుజీల్ తదితరులు పాల్గొన్నారు.












