బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 16
బైంసా మండలంలోని మాంజరి గ్రామానికి చెందిన పోతన్న రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ లేదా జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అవకాశం లభిస్తే ఎన్నికల బరిలో నిలిచి ప్రజలకు మరింత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రజా సేవలో పోతన్న
ఇప్పటికే పోతన్న గ్రామ ప్రజలతో మమేకమవుతూ వారి సుఖదుఃఖాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. గ్రామంలో జరిగే వివిధ సామాజిక, ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి అందుబాటులో ఉంటూ తన వంతు సహకారం అందిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
అభివృద్ధి లక్ష్యంగా ముందుకు
ఈ క్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ లేదా జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం వస్తే పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యంతో పోతన్న ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.