బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 15
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా బైంసా ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంక్షేమ పథకాలు
ప్రధాని పాలనలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన తెలిపారు. దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమని, దేశం బానిస సంకెళ్ళ నుండి విముక్తి సాధించి, ఎంతో పురోగతి సాధించిందన్నారు.
కార్యక్రమాలు
ఈ సందర్భంగా బైంసా ఏరియా ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం బస్ట్ స్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు
అదే విధంగా బీజేపీ ఆధ్వర్యంలో భైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో కూడా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లోనూ పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.