అమరావతి, 2026-06-05
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం () కార్యాచరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది. విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం () కార్యాచరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది. విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
ఎన్నికల కీలక తేదీలు
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక తేదీలు, మార్గదర్శకాలను కమిషన్ ప్రకటించింది. సెప్టెంబరు 7న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ, సెప్టెంబరు 20న అభ్యంతరాలు/క్లెయిమ్‌ల దాఖలుకు తుది గడువు, సెప్టెంబరు 23న అభ్యంతరాల పరిష్కారం ఉంటాయి.
సెప్టెంబరు 28న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటీసు జారీ చేయగా, అక్టోబరు 11న నామినేషన్ల దాఖలు, అక్టోబరు 14న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అక్టోబరు 19న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు. అక్టోబరు 28న పోలింగ్ మరియు పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, నవంబరు 1న వార్డు సభ్యుల ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు.
సహకరించాలని కోరారు
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నీ పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.