సారంగాపూర్, 2026-09-02
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు.
ఘనంగా మాజీ సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.
సారంగాపూర్ సెప్టెంబర్ 02 మనోరంజని తెలుగు టైమ్స్ : నిర్మల్ జిల్లా, సారంగాపూర్:మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17 వ.వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భోల్లోజి నర్సయ్య,గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న లు మాట్లాడుతూ వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనియన్నారు. తన పరిపాలనతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు పూయించిన మహానాయకుడు అన్నారు. సంక్షేమ పథకాలంటే గుర్తుకువచ్చే ఏకైక పేరు వైఎస్సార్. నిరుపేదల ఆకలి తీర్చిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. తెలుగు ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణా రెడ్డి, నాయకులు పోతిరెడ్డి నర్సారెడ్డి,నారాయణ రెడ్డి,వార్డు సభ్యులు కార్యకర్తలు, అభిమానులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మహానేత వైఎస్సార్‌కు అంజలి ఘటించారు.












