ముధోల్, 2026-06-05
భారత జాతీయ యువజన కాంగ్రెస్ 666వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ హాజరయ్యారు. 1960 ఆగస్టు 9న ప్రారంభమైన యువజన కాంగ్రెస్, నేడు దేశంలోని కోట్లాది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు.
భారత జాతీయ యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ హాజరయ్యారు. 1960 ఆగస్టు 9న ప్రారంభమైన యువజన కాంగ్రెస్, నేడు దేశంలోని కోట్లాది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని ఈ సందర్భంగా వక్తలు తెలిపారు.
నిరుద్యోగం, ధరల పెరుగుదలపై పోరాటం
ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగం. పేపర్ లీకేజీలు, ధరల పెరుగుదల, రైతుల కష్టాలు వంటి అనేక సమస్యలపై యువజన కాంగ్రెస్ వీధి పోరాటాలు చేస్తోందని ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ షఫీ అన్నారు. యువజన కాంగ్రెస్ స్ఫూర్తిని కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. నియోజకవర్గంలోని ప్రతి యువకుడిని కాంగ్రెస్ జెండా కింద నిలబడి, నియోజకవర్గం అభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నాయకుల భాగస్వామ్యం
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సమర సింహారెడ్డి, ముధోల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆదేశానుసారం ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బంక బాబు, కార్యదర్శి రవికుమార్, మాజీ మండల అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, బషీర్ భాయ్, మక్సూద్, మాజీ ఎంపీ చంద్రకాంత్, దేవిదాస్, శివాజీ, స్వామి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆశయాలతో ముందుకు
స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ, స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ చూపిన బాటలో, శ్రీ రాహుల్ గాంధీ ఆశయాలతో ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. జై కాంగ్రెస్... జై యువజన కాంగ్రెస్... జై హింద్ నినాదాలతో సభ ముగిసింది.












