నల్గొండ జిల్లాకు చెందిన 40 ఏళ్ల రోగికి హైదరాబాద్‌లోని మలక్ పేట యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు అత్యాధునిక ప్రేస్ శస్త్రచికిత్స ద్వారా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్‌కు విజయవంతంగా చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు చికిత్స వివరాలను వెల్లడించారు.
నల్గొండ జిల్లాకు చెందిన 40 ఏళ్ల పురుష రోగి, తీవ్రమైన కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, టైప్-2 మధుమేహంతో బాధపడుతూ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరారు. ఏడాది కాలంగా కడుపు నొప్పి వెనుక భాగానికి, నాభి ప్రాంతానికి వ్యాపిస్తుందని రోగి తెలిపారు. సమగ్ర పరీక్షల అనంతరం, వైద్యులు అతనికి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్, ఫిస్టులా ఇన్ అనో సమస్యలు ఉన్నాయని నిర్ధారించి, శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించారు.
యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి కంఠాల మాట్లాడుతూ, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది ప్యాంక్రియాస్‌లో దీర్ఘకాలిక వాపు వల్ల ఏర్పడే తీవ్రమైన వ్యాధి అని వివరించారు. ఇది ప్యాంక్రియాస్ పనితీరును దెబ్బతీసి, జీవన నాణ్యతను తగ్గిస్తుందని ఆయన పేర్కొన్నారు. సరైన సమయంలో శస్త్రచికిత్స చేయడం ద్వారా దీర్ఘకాలిక ఉపశమనం పొందవచ్చని, ప్రేస్ ప్రొసీజర్ వంటి ఆధునిక పద్ధతులు రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.
వైద్యులు ప్యాంక్రియాస్‌లో ఒత్తిడి తగ్గించడానికి ఫ్రీ'స్ ప్రొసీజర్, గాల్ బ్లాడర్ తొలగింపు (కొలసిస్టెక్టమీ), ఫిస్టులాకు లేజర్ చికిత్సతో పాటు ఫైట్రోటిక్ టిష్యూ, అంటుకట్టిన భాగాల సమర్థ నిర్వహణతో కూడిన సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ చికిత్స ఎటువంటి అంతర్గత సమస్యలు లేకుండా పూర్తయిందని, రోగి పోస్ట్-ఆపరేటివ్ దశలో సజావుగా కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.
యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఆధునిక సర్జికల్ గ్యాస్ట్రోపింటరాలజీ సేవలు, నిపుణులైన వైద్య బృందం, సమగ్ర వైద్య విధానం రోగులకు మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయని పేర్కొంది. ఈ విజయవంతమైన చికిత్స వైద్యరంగంలో యశోద ఆసుపత్రికున్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.








