బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 06
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 9న బోథ్ మండల కేంద్రంలోని కొమురం భీమ్ విగ్రహం వద్ద నిర్వహించనున్న వేడుకలను విజయవంతం చేయాలని న్యాయవాది పంద్రం శంకర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మండలంలోని పట్నాపూర్, మెడిగూడ, రెండ్లపల్లె, కొత్తపల్లె గ్రామాల్లోని ప్రజలతో ఆయన సమావేశాలు నిర్వహించి, దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు.

ఆదివాసీ సంస్కృతి, ఐక్యత చాటేలా వేడుకలు
ఈ సందర్భంగా న్యాయవాది పంద్రం శంకర్ మాట్లాడుతూ, ఆదివాసీల గొప్ప సాంస్కృతిక సంప్రదాయాలు, వారి ఐక్యతను ప్రతిబింబించేలా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అన్నారు. సంప్రదాయ వేషధారణలు, డోలు వాయిద్యాలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఆదివాసీ సంస్కృతి, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ సమావేశాలలో సర్మేడీలు ఆడేం భీంరావ్, మాడవి గంగారాం, కరత్వాడ సర్పంచ్ దుర్వ విశ్వేశ్వర్ రావు, పట్నాపూర్ మాజీ సర్పంచ్ తొడసం గోపాల్, నక్కల్వాడ ఉపసర్పంచ్ నాగోరావు, ఆయా గ్రామాల పటేలు, దేవరీలు, ప్రజలు, యువకులు పాల్గొన్నారు.