నిర్మల్, జూన్ 30
తెలంగాణ ట్రాన్స్కో ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ డివిజన్లో ఉద్యోగులకు ప్రథమ చికిత్సపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాలు, పాము కాటు, వడదెబ్బ వంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స విధానాలపై వైద్యులు అవగాహన కల్పించారు.
తెలంగాణ ట్రాన్స్కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ డివిజన్లో ఉద్యోగులకు ప్రథమ చికిత్సపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ నెల 26వ తేదీ నుంచి జూలై 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న విద్యుత్ భద్రత వారోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో నిర్మల్ స్వప్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చెందిన వైద్యులు డాక్టర్ శశికాంత్ నలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు, పాము కాటు, వడదెబ్బ వంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రథమ చికిత్స విధానాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో ప్రాణాలను రక్షించేందుకు పాటించాల్సిన పద్ధతులను ప్రత్యక్షంగా వివరించారు.
కార్యక్రమంలో ఉద్యోగులు ఆసక్తిగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఉద్యోగుల్లో భద్రత పట్ల మరింత చైతన్యం పెంచడంతో పాటు ప్రమాద సమయాల్లో సరైన చర్యలు తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ట్రాన్స్కో నిర్మల్ డివిజన్ అధికారులు, ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












