జమ్మూ కాశ్మీర్ లోని బారాముల లో గల అత్యంత శీతల ప్రాంతంలో మంచు పర్వతంపై నృత్యం చేసి అందరి ప్రశంసలు అందుకున్న ముథోల్ కు చెందిన 11 ఏళ్ల బాలిక వరేణ్యను జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి బి. పోతన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
నగేష్ కుమార్- సరిత రాణి దంపతుల కుమార్తె అయిన వరేణ్య, మంచు పర్వతాల నేపథ్యంలో చేసిన నృత్య ప్రదర్శనతో ముథోల్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని బి. పోతన్న యాదవ్ అన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు ఇవ్వాలని ఆకాంక్షించారు.
వరేణ్య తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని ఆయన ప్రశంసించారు. పిల్లలు చదువుతో పాటు ఇతర రంగాలలో రాణించడానికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని, ఈ విషయంలో వరేణ్య తల్లిదండ్రులు ఆదర్శమన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగా ప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. వరేణ్య సాధించిన ఈ ఘనత, ఇతర యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.











