భీమారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోడేటి రవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పోడేటి రవి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాల ఫలితమే ఈ రాష్ట్ర ఆవిర్భావమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు ఉష్కమల్ల పున్నం చంద్, జర్పుల రాజ్ కుమార్ నాయక్, ఉష్కమల్ల శ్రీనివాస్, కోల కిష్టయ్య, బోయిని శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు కొత్త సత్తి రెడ్డి, అన్నమల్ల అశోక్ తో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










