కేరళలో కాంగ్రెస్ సాధించిన విజయం నేపథ్యంలో, తెలంగాణలోనూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆదివాసి కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ విశ్వాసం వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేరళలో కమ్యూనిస్టు పార్టీలను ఓడించి కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టారని ఆయన గుర్తుచేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేరళలో కాంగ్రెస్ సాధించిన విజయానికి గాను సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లకు ఆయన అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందని, అందుకే ప్రజలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలకు ఇకపై అవకాశం ఉండదని గోవింద్ నాయక్ అన్నారు.












