తానూర్, 2026-06-05
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గం పరిధిలోని తానూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ శ్రీధర్ సూచించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

అధికారుల ఆదేశాలు
సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన సమస్యలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎంపీడీఓ శ్రీధర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.