Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
సోన్ మండల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చూడాలని, అభివృద్ధి పనులను నాణ్యతతో, గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సోన్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల సమీక్షా సమావేశంలో భారతీయ జనతా శాసనసభా పక్ష నాయకుడు, నిర్మల్ శాసనసభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
అలాగే మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ మెరుగైన సేవలు అందించాలని సూచించారు.












