నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆధునిక బోధన కోసం డిజిటల్ ప్యానెల్స్ ను ప్రారంభించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కునేరు భూమన్న పాల్గొని, విద్యార్థుల అభ్యసనంలో వీటి ప్రాముఖ్యతను వివరించారు.
ప్రగతి ప్రణాళిక విద్య వారోత్సవాల సందర్భంగా, ప్రజా పాలన కార్యక్రమాల స్ఫూర్తితో ఈ డిజిటల్ ప్యానెల్స్ ను కళాశాలలో ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థులు ఇంటరాక్టివ్ లెర్నింగ్ పద్ధతులను అవలంబించవచ్చని సర్పంచ్ తెలిపారు.
ఈ ఆధునిక బోధనా పరికరాలు విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి దోహదపడతాయని కళాశాల అధికారులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఇంచార్జీ ప్రిన్సిపాల్ శంకర్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. డిజిటల్ బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.








