సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం రాసులాబాద్ గ్రామ నూతన సర్పంచ్ పచ్చిమడ్ల అనూష స్వామి గౌడ్ ను జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనూష గౌడ్ గెలుపొందడంతో నాయకులు అభినందనలు తెలిపారు.
రాసులాబాద్ గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సర్పంచ్‌గా పచ్చిమడ్ల స్వామి గౌడ్ గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన శ్రీమతి పచ్చిమడ్ల అనూష గౌడ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో జాతీయ నాయకులు పాల్గొని, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందించాలని నూతన సర్పంచ్‌కు సూచించారు.
ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు అమరవేణి నర్సా గౌడ్, జాతీయ సెక్రటరీ జనరల్ రాగుల సిద్ధిరాములు గౌడ్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజు గౌడ్, జిల్లా అధ్యక్షులు పచ్చిమడ్ల స్వామి గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బుచ్చంగారి కిషన్ గౌడ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు బాలగోని రేఖ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కిష్టాపురం సిద్దా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.









