నిజామాబాద్, 2026-06-05
అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ఫోటో స్టూడియోల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగంలో విశేష సేవలందించిన సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించారు.
అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా రాజు ఫోటో స్టూడియో, గీత ఫోటో స్టూడియో, మౌనిక ఫోటో స్టూడియో ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లను, ఫోటోగ్రఫీ రంగంలో సేవలు అందించిన వారిని శాలువా, పూలమాలలతో సత్కరించారు.
లూయిస్ దగ్గరేకు నివాళులు
కార్యక్రమం ప్రారంభానికి ముందు ఫోటో కెమెరా సృష్టికర్త లూయిస్ దగ్గరే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంచి, ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.












