ఖానాపూర్, 2026-08-09
ఖానాపూర్ పట్టణంలోని పద్మశాలి సంఘం విద్యానగర్2 నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి వి. శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రక్రియలో పలువురు కీలక పదవులకు ఎన్నికయ్యారు.
ఖానాపూర్, ఆగస్టు 9, మనోరంజని తెలుగు టైమ్స్: పద్మశాలి సంఘం విద్యానగర్2 నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో, సహాయ ఎన్నికల అధికారి ఎనిగందుల నారాయణ సహకారంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు.
నూతన కార్యవర్గం వివరాలు
నూతన కార్యవర్గంలో గౌరవ అధ్యక్షుడిగా వడ్లకొండ రాజన్న, అధ్యక్షుడిగా ఎనిగందుల రమణయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సిలారి రవి, మాసవత్తి రమేష్, ఎనిగందుల నారాయణ, ప్రధాన కార్యదర్శిగా మామిడాల రమేష్, సహాయ కార్యదర్శులుగా నల్ల నాగరాజు, శ్యామల ప్రభాకర్, కోశాధికారిగా శైలేంద్ర కన్నయ్య, సహాయ కోశాధికారిగా దానిపల్లి సుధాకర్, ప్రచార కార్యదర్శిగా అంకం పోశెట్టి, సామాజిక మాధ్యమాల ప్రతినిధిగా వడ్లకొండ భూమన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సలహాదారుల నియామకం
ముఖ్య సలహాదారులుగా వి. శ్రీనివాస్, కంఠం రవీందర్, చుక్కల రాజేశ్వర్, కొండ నారాయణ (ఆర్టీసీ)లను ఎంపిక చేశారు.
ప్రమాణ స్వీకారం, అధ్యక్షుడు భరోసా
అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎనిగందుల రమణయ్య మాట్లాడుతూ పద్మశాలి సంఘంలోని ప్రతి సభ్యునికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సంఘ సభ్యుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.












