మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 09
ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందిన ఆర్థో రోగులకు ఉచిత అంబులెన్స్ సేవలను జిడిఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందిస్తోంది. శాస్త్ర చికిత్స, మందులు, భోజనం, ప్రయాణ ఖర్చులతో పాటు ఇంటి వరకు ఉచితంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించినట్లు హాస్పిటల్ ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాధవ్ తెలిపారు.
ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందిన ఆర్థో రోగులకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిడిఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి డాక్టర్ అనిల్ కుమార్ జాధవ్ తెలిపారు. శాస్త్ర చికిత్స, మందులు, అల్పాహారం, భోజనం, ప్రయాణ ఖర్చులతో పాటు ఇంటి వరకు ఉచితంగా జిడిఆర్ ట్రస్ట్ ద్వారా అంబులెన్స్ సేవలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వైద్యం అనంతరం ఇంటికి వెళ్లే రోగుల సౌకర్యార్థం ఈ సేవలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ జిడిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిడిఆర్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేసుకునే రోగులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
రోగులు ఈ ఉచిత అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఉచిత అంబులెన్స్ సేవలు కల్పించడం పట్ల ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ వివి హేమంత్ కళ్యాణ్, సామాజిక కార్యకర్త జాధవ్ పుండలిక్ రావు పాటిల్, రోగుల బంధువులు, పలువురు హర్షం వ్యక్తం చేశారు.












