నిర్మల్ పట్టణంలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం చేపట్టిన 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'లో భాగంగా 99 రోజుల కార్యాచరణపై అవగాహన కల్పించే దిశా నిర్దేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాల్గొని అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పై చర్చించారు.


