నిర్మల్, 2026-06-05
నిర్మల్ జిల్లా మామడ మండలం కోరిటికల్ గ్రామానికి చెందిన పల్లికొండ సంగీతకు, ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు గాను భారత్ కళావైభవ్ అవార్డును అందజేశారు. ధూమ్ డ్యాన్స్ స్టూడియో, ప్రగతి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ అవార్డును అందించాయి.

గత రెండేళ్లుగా ఉద్యోగాల కోసం సిద్ధమవుతూ, తనతో పాటు ఇతర పేద అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పల్లికొండ సంగీత పనిచేస్తున్నారు. సోల్జర్స్ గ్రూప్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల నిరుపేద అభ్యర్థులకు ఆమె మార్గనిర్దేశం చేస్తున్నారు. పుస్తకాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నవారికి ఉచిత పుస్తకాలను పంపిణీ చేసి, వారిని ఉద్యోగస్థులుగా తీర్చిదిద్దడంలో ఆమె కృషి చేస్తున్నారు.
ఈ సేవా కార్యక్రమాలను గుర్తించి, హైదరాబాద్లోని బిర్లా మందిరం సమీపంలో ఉన్న భాస్కర్ ఆడిటోరియంలో ఆమెకు భారత్ కళావైభవ్ అవార్డును అందించారు. ఈ కార్యక్రమంలో సోల్జర్స్ గ్రూప్ ఫౌండర్ చౌహన్ కృష్ణ, ప్రగతి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కల్వకుర్తి అరీపుదిన్, ధూమ్ డాన్స్ స్టూడియో స్థాపకులు అజీమ్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత సాజిద ఖాన్ తదితరులు పాల్గొన్నారు.