తెలంగాణ ముస్లిం ఎంప్లాయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు, శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.
అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రజా సేవలో అప్పాల గణేష్ చక్రవర్తి మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో పట్టణ అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి స్పందిస్తూ, తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ముస్లిం ఎంప్లాయ్ అసోసియేషన్ సభ్యులు ఇంతియాజ్ సహా పలువురు పాల్గొన్నారు. వీరితో పాటు ఇతర సిబ్బంది కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.


