నిర్మల్ రూరల్, జూన్ 21
మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జిగా బరుకుంట అశోక్‌ను నియమించారు. మాదిగ సమాజ హక్కుల సాధన, సంఘ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ నియామకం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు కత్తి విష్ణు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.
మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌డీ) నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జిగా బరుకుంట అశోక్‌ను నియమించారు. మాదిగ సమాజ హక్కుల సాధన, సంఘ బలోపేతానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ నియామకం చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు కత్తి విష్ణు తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. సమితి సిద్ధాంతాలు, లక్ష్యాలను నియోజకవర్గ వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తూ, మాదిగ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని అశోక్‌కు సూచించారు.
ఆయన నాయకత్వంలో సంస్థ మరింత బలోపేతమై, మాదిగ హక్కుల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని కత్తి విష్ణు ఆశాభావం వ్యక్తం చేశారు.












